రేపు ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్
NEWS Sep 26,2024 05:28 pm
హైదరాబాద్: ప్రజాభవన్‌లో రేపు ఉ. 10 గంటలకు గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని టీ-పీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ బిఎం వినోద్ కుమార్ చెప్పారు. ప్రజా ప్రతినిధులు, గల్ఫ్ కార్మిక కుటుంబాలు, గల్ఫ్ సంఘాలు పాల్గొనే కార్యక్రమంలో అందనా ఆహ్వానిస్తున్నమన్నారు టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి.