విద్యార్థులకు బస్సు పాస్ లు పంపిణీ
NEWS Sep 26,2024 06:21 pm
విద్యార్థులకు ఆర్టీసీ అందిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పేర్కొన్నారు. గురువారం శంఖవరం లో వున్న హైస్కూల్ విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బస్సు పాస్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.