విద్యార్థులకు ఇన్సూరెన్స్ సదుపాయం: కలెక్టర్
NEWS Sep 26,2024 06:13 pm
ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం ద్వారా కోనసీమ జిల్లాలోని అంగన్వాడి, అనాధాశ్రమాలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు రూ.50 వేలు నుంచి లక్ష ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఆయన అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద గురువారం ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు స్థానిక అధికారులతో సమావేశం నిర్వహించారు.