ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుక
NEWS Sep 26,2024 06:12 pm
రాజన్న సిరిసిల్ల: భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం చేసిందని పలు వివిధ పార్టీల నాయకులు అన్నారు. సిరిసిల్లలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలను వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మహిళా లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని, ఆమె త్యాగాలను,ఆమె ధైర్య సాహాసాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.