జూనియర్ రెడ్ క్రాస్ సభ్యత్వాలు అందజేత
NEWS Sep 26,2024 06:18 pm
ఇండియన్ రెడ్ క్రాస్ సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని స్థానిక గీతా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 30 మంది బాలబాలికలకు జూనియర్ రెడ్ క్రాస్ సభ్యత్వము అందించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద అధ్యక్షత వహించగా ఇండియన్ రెడ్ క్రాస్ సిరిసిల్ల జిల్లా శాఖ చైర్మన్ గుడ్ల రవి, వైస్ చైర్మన్ పి.వేణు కుమార్, రామచంద్రరావు రిటైర్డ్ మండల విద్యాధికారి అతిథిగా హయారయ్యారు. సభ్యులు గుడ్ల సునీల్ ఇరుకుల్ల భాస్కర్,పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సురేష్ నిర్వహించారు.