నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి
NEWS Sep 26,2024 06:13 pm
కాకినాడ జిల్లాలోని పోలీసు అధికారులు అందరూ నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద జిల్లాలోని పోలీసు అధికారులతో గురువారం నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలు పట్ల ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ నేరాలను నియంత్రించాలన్నారు.