ముగ్గురు నిందితులకు జైలు శిక్ష
NEWS Sep 26,2024 06:15 pm
సిరిసిల్ల జిల్లా: హత్యయత్నంకు కారణమైన ముగ్గురు రౌడి షీటర్స్ కి ఒక్కొక్కరికి 3 సంవత్సరాల జైలు శిక్ష రూ. 1000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల అసిస్టెంట్ సబ్ కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ గురువారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని, శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలీసులు, ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ, న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.