ప్రభుత్వ మద్యం షాపులు రద్దు
రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతి
NEWS Sep 26,2024 04:07 pm
నూతన మద్యం పాలసీకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే నూతన మద్యం విధానానికి చంద్రబాబు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. వాటి స్థానంలో మళ్లీ రిటైల్ షాపులకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఇక నుంచి రాష్ట్రంలో మళ్లీ ప్రైవేట్ మద్యం షాపులు రానున్నాయి.