అదుపుతప్పి సిమెంట్ లోడు లారీ బోల్తా
NEWS Sep 26,2024 04:02 pm
సిమెంట్ లోడ్ లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ రాష్ట్రం కర్నూల్ జిల్లా నంద్యాల నుంచి మల్లాపూర్ మండల కేంద్రానికి సిమెంటు లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడిందని తెలిపారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదని తెలిపారు.