కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు
NEWS Sep 26,2024 04:14 pm
MNCL: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం మంచిర్యాల పట్టణ, జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల దేవేందర్ తెలిపారు. ఈ వేడుకల్లో పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని బాపూజీ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.