బాలినేనిపై టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సంచలన వ్యాఖ్యలు..!
NEWS Sep 26,2024 02:24 pm
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి నుంచి తప్పించుకునేందుకే జనసేనలో చేరారని టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ అన్నారు. ఎన్నికల ముందు బాలినేని టీడీపీ శ్రేణులు, నాపై అనేక కేసులు పెట్టారు. ఆయనను జనసేనలోకి ఎలా చేర్చుకుంటున్నారో అర్థంకావడం లేదన్నారు. బాలినేని, ఆయన కొడుకు దౌర్జన్యాలను ఉపేక్షించేది లేదని, ఈ విషయంలో ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధమన్నారు.