జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు
NEWS Sep 26,2024 02:06 pm
వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), కిలారి రోశయ్య (పొన్నూరు) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ కండువా కప్పి వారిని జనసేనలోకి ఆహ్వానించారు. వీరితోపాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకుల చేరికతో ఈ మూడు నియోజకవర్గాల్లో జనసేన బలం పెరిగింది.