నవరాత్రుల కోసం షెడ్డు నిర్మాణ పూజ
NEWS Sep 28,2024 11:26 am
జోగిపేట పట్టణంలో శ్రీ పబ్బతి హనుమాన్ మందిర్ ముందు ఏటా దుర్గా భవాని అమ్మవారి విగ్రహాన్ని స్నేహ యూత్, సిరి యూత్ ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా నెలకొల్పుతూ దేవి నవరాత్రులు జరుపుతున్నారు. ఈసారి నవరాత్రుల కోసం షెడ్డు నిర్మాణ పూజ చేశారు. నిత్యం అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. ఏటా నవరాత్రులు జరపడం ఆనవాయితీగా వస్తున్నది. అమ్మవారు భక్తుల కోరికలు నెరవేర్చే కొంగుబంగారంలా విరాజిల్లుతున్నది.