పీడిత ప్రజల కోసం పోరాడిన యోధురాలు
NEWS Sep 26,2024 06:23 pm
కథలాపూర్ మండలంలో చాకలి ఐలమ్మ వేడుకలు ఘనంగా రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. సంఘం అధ్యక్షులు చలిమల మహేష్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పీడిత ప్రజల కోసం సంకల్పంతో ముందుకు సాగిన యోధురాలు అని అన్నారు. బడుగు బలహీన వర్గాలు అందరు కలిసి ఒక తాటిపై రావాలని కోరిన యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మను పోరాట స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జలంధర్ అజయ్, గంగాధర్, నరేందర్, రాజు, రాజేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.