కోరుట్ల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
NEWS Sep 26,2024 01:06 pm
కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్లాస్టిక్ ఏజెన్సీలు, కిరాణా దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వారు వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను స్వాధీన పరుచుకొని రూ. 6000 జరిమానాలు విధించారు. బట్ట సంచుల వాడకంపై అవగాహన కల్పించారు. దుకాణదారులందరూ, పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. దుకాణదారులందరూ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని, లేదంటే భారీ జరిమానాలు విధించడంతో పాటు వాటిని సీజ్ చేస్తామన్నారు.