ఐలమ్మ ఆశయాలను కొనసాగిద్దాం:
TJF రాష్ట్ర కార్యదర్శి స్వామి ముద్దం
NEWS Sep 26,2024 12:09 pm
మల్లాపూర్: తెలంగాణ దిక్కర స్వరానికి నిలువు టద్దం, వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మల్లాపూర్ రజక సంఘం ఆధ్వర్యం లో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి స్వామి ముద్దం పూలమాల వేసి నివాళి అర్పిం చారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగిం చటమే ఆమెకు మనమిచ్చే ఘన నివాళి అని చెప్పారు. రజక సంఘం నాయకులు రాజేందర్, BRS నాయకులు బండి లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.