విద్యుత్ వినియోగదారుల ఫోరం సదస్సు
NEWS Sep 26,2024 04:12 pm
తూప్రాన్ విద్యుత్తు డివిజన్ కార్యాలయం వద్ద ఈనెల 28న ఉదయం 10 గంటలకు విద్యుత్ వినియోగదారుల ఫోరం సదస్సు నిర్వహిస్తున్నట్లు డిఈ రాజేందర్ తెలిపారు. తూప్రాన్ డివిజన్ పరిధి తూప్రాన్, కాళ్ళకల్, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట, చేగుంట, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట సెక్షన్లకు సంబంధించిన విద్యుత్ వినియోగదారులు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. విద్యుత్ బిల్, ఆధార్ కార్డుతో హాజరుకావాలని కోరారు.