ఐలమ్మ స్ఫూర్తితో పోరాటం చేద్దాం
NEWS Sep 26,2024 01:43 pm
సదాశివపేట: భూమి కోసం భుక్తి కోసం పోరాడిన దొరలను తన మాటల తూటాలతో మహిళల్లో పోరాట ప్రతిమాను నింపిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మనమందరం భూమి కోసం మరోసారి పోరాడాల్సిన అవసరం ఉందని సిపిఐ పట్టణ కార్యదర్శి వినోద పిలుపునిచ్చారు. సదాశివపేటలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి సిపిఐ నేతలు పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.