అక్టోబర్ 4న చలో కలెక్టరేట్
NEWS Sep 26,2024 11:19 am
మెట్ పల్లి: అక్టోబర్ 4న జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముట్టడికి తరలి రావాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతు నాయకులు పిలుపునిచ్చారు. మండలంలోని వేంపేట గ్రామంలో రైతులతో మాట్లాడుతూ ఏలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ, ఎకరాకి 15000 రైతు భరోసా, అలాగే వరికి క్వింటాల్ కి 500 బోనస్ ప్రకటించాలని కోరుతూ చేపట్టిన కార్యక్రమాన్ని జిల్లా నలుమూలల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.