డీఎస్పీ ఆదినారాయణకు స్వాగత సత్కారం
NEWS Jan 30,2026 10:28 pm
కొత్తగూడెం డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎల్. ఆదినారాయణను లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల పెద్దతండ పంచాయతీ సర్పంచ్ లావుడ్య పూర్ణ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సర్పంచ్ లావుడ్య పూర్ణ మాట్లాడుతూ, యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడా పోటీలను నిర్వహిస్తూ, వాటికి పోలీస్ అధికారుల సహకారాన్ని తీసుకున్నామని తెలిపారు. సమాజంలో శాంతి, భద్రతల పరిరక్షణకు ప్రజలు–పోలీసులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.