గీతాకార్మికులకు కాటమయ్య రక్షణకిట్టు శిక్షణ
NEWS Sep 26,2024 10:59 am
కోరుట్ల: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కాటమయ్య మోకులు తాళ్లు ఎక్కే గీతా కార్మికులకు రక్షణగా నిలుస్తాయని పాపన్న గీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు చెట్ల చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలో జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో కాటమయ్య సేఫ్టీ మోకులపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గీత కార్మికులు ప్రతి ఒక్కరూ ఈ సేఫ్టీ మోకులను వాడి ప్రమాదాలను నివారించాలని కోరారు. అనంతరం గీతా కార్మికులకు సేఫ్టీమోకుల వాడకంపై శిక్షణ ఇచ్చారు.