మల్యాల: చాకలి ఐలమ్మ జయంతి వేడుక
NEWS Sep 26,2024 11:04 am
మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా వద్ద రజక సంఘం సభ్యులు చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, తెలంగాణ తెగువకు చిరునామాగా నిలిచిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మల్యాల గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, రాజమల్లయ్య, రమేష్, గంగయ్య, శైలేష్, నర్సయ్య, రవి, రాజు, వెంకటేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.