వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
NEWS Sep 26,2024 01:32 pm
మెదక్ జిల్లా, మెదక్ ఎస్పీ కార్యాలయం నందు ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి, ఏఎస్పి మహేందర్ తదితర సిబ్బంది పాల్గొని చాకలి ఐలమ్మ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి చాకలి ఐలమ్మ గొప్పతనాన్ని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.