విద్యార్థులకు లయన్స్ క్లబ్ దంతపరీక్షలు
NEWS Sep 26,2024 06:20 pm
జోగిపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. లయన్స్ సభ్యులు, దంత వైద్యుడు డాక్టర్ పాల్ నేతృత్వంలో దంత పరీక్షలను నిర్వహించారు. విద్యార్థులకు దంతాల శుభ్రంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు లయన్స్ క్లబ్ సభ్యులు. 150 మందికి బ్రష్ లు ఉచితంగా అందజేశారు. లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శులు dr అనంతరెడ్డి, ఆకుల రాంబాబు, జోన్ చైర్మన్ రామకృష్ణ, ప్రధానోపాధ్యాయులు రజితలీల, సుజాత, తదితరులు పాల్గొన్నారు.