MTL: ఐలమ్మకి రజక సంఘాల నివాళి
NEWS Sep 26,2024 10:33 am
మెట్ పల్లి ట్టణానికి చెందిన 5 రజక సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని ఆమె విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాట వీర వనితని ఆమె చేసిన త్యాగం, పోరాటం ఈ తరం ఉద్యమకారులకు మార్గదర్శకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ 5 రజక సంఘాల అధ్యక్షులు వన్నెల శశి, కలికోట వేణు, పిప్పెర రాజ్ కుమార్, వన్నెల సాయిలు, దొడ్డిపట్ల శ్రీనివాస్, రజక పట్టణ సంఘ సభ్యులు పాల్గొన్నారు.