పేర్ని నాని ఇంటి వద్ద జనసైనికుల ఆందోళన
పవన్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్
NEWS Sep 26,2024 09:17 am
మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి దగ్గర జనసేన కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లడ్డూ వివాదంలో డిప్యూటీ సీఎం పవన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పేర్నినాని క్షమాపణ చెప్పాలని జనసైనికులు డిమాండ్ చేశారు. ఇంట్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో.. పోటీగా వైసీపీ కార్యకర్తలతో కలిసి పేర్ని కిట్టు నిరసనకు దిగారు. దీంతో పేర్ని నాని ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.