రేగుంటలో చాకలి ఐలమ్మ జయంతి
NEWS Sep 26,2024 09:04 am
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో గురువారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భూమి కోసం భక్తి కోసం పోరాటం చేసి జమీందారుల మెడలవంచిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంఈఓ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.