జోగిపేటలో లయన్స్ క్లబ్ వైద్య శిబిరం
NEWS Sep 26,2024 12:58 pm
జోగిపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ జాన్ పాల్ సహకారంతో పట్టణ కేంద్రంలోని బాలికల ప్రాథమిక-ఉన్నత పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో విద్యార్థుల దంతాలను వైద్యులు చెక్ అప్ చేశారు. అనంతరం విద్యార్థులకు టూత్ బ్రష్ లను పంపిణీ చేశారు. దంతాలు మన శరీరంలో ముఖ్యమైనవని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు అల్లె శ్రీకాంత్, రాంబాబు, డాక్టర్ అనంత్ రెడ్డి, మన్నే చంద్రశేఖర్ (రాజు), సంతోష్ కుమార్, పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.