కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 28న నిర్వహించే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు కోరారు. సంగారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో గురువారం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ కాంటాక్ట్ కార్మికులకు నెలకు 26వేల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.