ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
NEWS Sep 26,2024 11:17 am
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి మాట్లాడుతూ మహనీయుల చరిత్రను భావితరాలకు తెలిపేందుకే వారి జయంతి వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్ఓ పద్మజారాణి పాల్గొన్నారు.