10న సద్దుల బతుకమ్మ, 12న దసరా
NEWS Sep 26,2024 11:09 am
మల్యాల మండల కేంద్రంలో గ్రామ పెద్దల సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పండగల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ చర్చించారు. అనంతరం గ్రామ పురోహితుడు ప్రణీత్ శర్మ పండగల తేదీలను ప్రకటించారు. అక్టోబర్ 10న సద్దుల బతుకమ్మ, 12న దసరా వేడుకలు జరుపుకోవడానికి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ రెడ్డి, ప్రసాద్, వంశీధర్, వెంకన్న, తిరుపతి, గోవర్ధన్, రాములు, శంకర్, రవి తదితరులు పాల్గొన్నారు.