స్వచ్ఛతా కీ భాగీదారీలో కాంపిటీషన్స్
NEWS Sep 26,2024 09:03 am
మున్సిపల్ కమీషనర్ బట్టు తిరుపతి గారి ఆదేశాల మేరకు స్వచ్చత హి సేవ కార్యక్రమంలో భాగంగా కల్లూరు రోడ్డు లో గాల ZPHS GIRLS పాఠశాలలో ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలను మరియు తడి పొడి చెత్త వేరు చేసే విధానాన్ని వివరించి డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో 282 విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు వేసిన డ్రాయింగ్స్ స్వచ్ఛతకు అద్దం పట్టేలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా కోరుట్లను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుకోవచ్చని పిల్లలు చెప్పారు.