స్వచ్ఛత హీసేవ కార్యక్రమంలో అవగాహన
NEWS Sep 26,2024 09:07 am
మెట్ పల్లి: స్వచ్ఛత హీసేవ కార్యక్రమంలో భాగంగా మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆధ్వర్యంలో బ్రూక్లిన్ గ్రామర్ హై స్కూల్ ఆవరణలో విద్యార్థులు, విద్యార్థినులతో SHS అక్షరాల ఆకృతిలో 600 మంది విద్యార్థులతో ప్రదర్శన అనంతరం స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటానని పక్క వారికి కూడా తెలియజేస్తానని, విద్యార్థులచే ప్రతిజ్ఞ చేపించారు.