ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలకు బాలిక ఎంపిక
NEWS Sep 26,2024 10:35 am
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాల నుండి పదవ తరగతి చదువుతున్న ఎలిగేటి శ్రావణి ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అయింది. జగిత్యాల జిల్లా స్థాయి ఎస్ జి ఎఫ్ 2024 క్రీడల్లో భాగంగా మంగవారం జగిత్యాలలో జరిగిన జిల్లా స్థాయి అండర్-17 వాలీబాల్ పోటీలో ప్రతిభ కనబరిచి, ఉమ్మడి జిల్లా పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఎలిగేటి శ్రావణిని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, ఆర్.కృష్ణవేణి అభినందించారు.