ప్రభుత్వ భూములను కాపాడే హక్కు ప్రతి ఒక్కరిపై ఉన్నట్లు జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు రమేష్ గౌడ్ అన్నారు. మండలంలోని ఇప్పపెల్లి గ్రామానికి చెందిన 400 ఎకరాల భూమిని కొంతమంది వ్యక్తులు తమ స్వార్థం కోసం చదును చేసి చెట్లను నాటినట్లు వాటిని వెంటనే ప్రభుత్వం గుర్తించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, దానికి దోహదపడ్డ అధికారులపై కఠినమైన చర్యలు జరిపాలని కోరారు. గ్రామస్తులంతా ఏకమై ఉన్నారని ఇంకా గ్రామ భూమిని ఎవరు ముట్టుకున్న వారికి తిప్పలు తప్పవని అన్నారు.