సీనియారిటీని బట్టి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి
NEWS Sep 26,2024 11:14 am
వేములవాడ నియోజకవర్గంలోని ఎన్నో ఏండ్ల నుండి కాంగ్రెస్ కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నామని, సీనియర్ నాయకులకే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలని కథలాపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తీపి రెడ్డి ఆనంతరెడ్డి కోరారు. వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీను తమపై ప్రత్యేక చొరవ చూపాలని, వైయస్సార్ పాదయాత్ర చేసినప్పుడే అతనితో పాదయాత్రలో పాల్గొన్నానని, తప్పకుండా తమకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు.