చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
NEWS Sep 26,2024 11:32 am
గజ్వేల్ పట్టణ పరిధి ప్రజ్ఞాపూర్ లో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, ఎఫ్డిసి మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.