108 వాహనంలో ప్రసవం, తల్లిబిడ్డ క్షేమం
NEWS Sep 26,2024 11:36 am
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో నివాసం ఉంటున్న బీహార్ రాష్ట్రానికి చెందిన లక్ష్మీదేవి అనే గర్భిణీ స్త్రీ 108 వాహనంలో ప్రసవించింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న లక్ష్మీదేవిని ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించగా గ్రామానికి చేరుకున్న రామాయంపేట 108 సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో, ఈఎంటి స్వామి లక్ష్మీదేవికి వాహనంలోనే ప్రసవం చేశారు. మగ బిడ్డకు జన్మనివ్వగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.