30 సెప్టెంబర్ నుంచి ఓటర్ నమోదు
NEWS Sep 26,2024 11:37 am
ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అవనున్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నట్లు CEO సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే మార్చి 29తో కరీంనగర్, NZB, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలు, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కానున్నాయి. ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీ కాగా డిసెంబర్ 30న తుది జాబితా విడుదల చేస్తారు.