గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
NEWS Sep 26,2024 11:44 am
ఇబ్రహీంపట్నం మండలంలోని వైయస్సార్ కాలనీలో గంజాయి విక్రయిస్తున్న చంద్ అనే వ్యక్తిని మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టుకున్నారు. దారి దోపిడీ చేసే దొంగలకు గంజాయి విక్రయిస్తున్నాడని తెలిసి పోలీసులు అతని ఇంటి వద్ద తనిఖీలు చేయగా అతని వద్ద 320 గ్రాముల గంజాయి దొరికింది. అతన్ని వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.