ఐటిఐలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
NEWS Sep 26,2024 11:45 am
సంగారెడ్డిలోని ప్రభుత్వ ఐటిఐలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఈనెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ రాజేశ్వర రావు ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలలో 26 సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ దరఖాస్తులను www.iti.telangana.gov.in లో దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు.