సింగూరు ప్రాజెక్టులోకి 12,128 క్యూసెక్కుల వరద నీరు
NEWS Sep 26,2024 12:23 pm
పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులోకి 12,128 క్యూసెక్కుల నీరు చేరిందని ఇరిగేషన్ ఎఈ మహిపాల్ రెడ్డి గురువారం తెలిపారు. కర్ణాటకలో గత రెండు రోజులుగా కొలుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు చేరుతుందని చెప్పారు. ప్రాజెక్టు నుంచి దిగువ భాగానికి 11,466 కేసెక్కిల నీటిని వదిలినట్లు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.