కలెక్టరేట్ ముందు మున్సిపల్ కార్మికుల ధర్నా
NEWS Sep 26,2024 12:26 pm
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారికి కనీస వేతనాలు అమలు చేసివారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సిఐటియుజిల్లా కార్యదర్శి కోడంరమణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గుర్రం అశోక్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60వేల మంది మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి వారికి కనీస వేతనాలు అందించాలని అన్నారు.