హత్య: ఇద్దరు నిందితులకు జైలు శిక్ష
NEWS Sep 26,2024 12:28 pm
రాజన్న సిరిసిల్ల: వ్యక్తి హత్యకు కారణమైన ఇద్దరు నిందితులలో ఒకరికి జీవిత ఖైదు, 2500 రూపాయల జరిమానా, మరో వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష, 2500 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత బుధవారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని, శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, తెలిపారు.