ఫ్యాకల్టీ పోస్టులకు ఇంటర్వ్యూ
NEWS Sep 26,2024 12:45 pm
మైనార్టీ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులకు ఔట్ సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ పద్ధతిలో భర్తీ చేసేందుకు బుదవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ 8పోస్టులకు1:6 చొప్పున ఇంటర్వ్యూ నిర్వహించారు. జిల్లాలోని ఆయా మైనార్టీ విద్యా సంస్థల్లో జూనియర్ లెక్చరర్(జే ఎల్)పోస్టులకు కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. ఒక్కో పోస్టుకు మెరిట్ ప్రకారం ఆరుగురు అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచారు. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన నిర్వహించారు.