స్థానికులకే రేషన్ షాపు కేటాయించాలి
NEWS Sep 26,2024 12:48 pm
స్థానికులకే రేషన్ షాప్ కేటాయించాలని కోరుతూ సిరిసిల్లలోని ఆర్డిఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొల్గం నాగరాజు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో రేషన్ డీలర్లకు సంబంధించి ఇటీవల నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు అధికారులు నిర్వహించి కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగిందని, ముష్టిపల్లిలో ఉన్న షాప్ ను స్థానిక వ్యక్తులను ఇద్దరినీ సెలెక్ట్ చేశారని, సెలెక్ట్ చేసిన వారికి కాకుండా స్థానికేతరులకు షాపు కేటాయించారని, వెంటనే రిజెక్ట్ చేయించి స్థానికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.