రేషనలైజేషన్ నిబంధనలను మార్చాలి
NEWS Sep 26,2024 12:50 pm
సిరిసిల్ల జిల్లాలో తరగతికి ఒక గది, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండి విద్యార్థులను వారి తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించవలసి ఉండగా, జి.ఓ.25 అమలు చేయాలని పాఠశాల విద్యా సంచాలకులు జిల్లా కలెక్టర్లను ఆదేశించడాన్ని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, అదే విధంగా 60 మంది విద్యార్థులకు కూడా ఇద్దరే ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు.