కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతోత్సవ ఆహ్వానం పత్రాలు ఆవిష్కరణ.
NEWS Sep 26,2024 12:51 pm
సిరిసిల్ల పట్టణంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈనెల 27న నిర్వహించనున్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతోత్సవ ఆహ్వానం పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్, పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా మాట్లాడుతూ ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ పోరాట మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు మాజీ మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి అన్నారు.