ఏఎంసీ చైర్మన్ కు సన్మానం
NEWS Sep 26,2024 12:53 pm
నూతనంగా నియామకమై సిరిసిల్లా ఏఎంసీ ఛైర్మెన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ జె(టోనీ) ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపి, ఘనంగా శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మెన్ నేరెళ్ల నర్సింగం, డైరెక్టర్ లు పొన్నాల పర్శరాము, ఆరేపల్లి బాలు, మాజీ ఎంపీటీసీ బైరినేని రాము,కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ గౌడ్, చెన్నమేనేని ప్రశాంత్, కొత్త రవి, మీరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.