దుర్మార్గమైన చర్య: నల్లా పవన్
NEWS Sep 26,2024 12:53 pm
లడ్డు ప్రసాదంలో జరిగిన ఘోరమైన సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్ డిమాండ్ చేశారు. అమలాపురంలో నిరసన ర్యాలీని చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలపడం దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.